' పర్యావరణ కవితోద్యమం ' ఆంధ్ర ప్రదేశ్ లో 2008 నుండి నడుపుచున్న ఒక ఉద్యమం. సాహిత్యం ద్వారా పర్యావరణ చైతన్యం ప్రజల్లో వ్యాప్తి చేయడమే ' పర్యావరణ కవితోద్యమం ' ప్రధాన లక్ష్యం. జాగృతి కిరణ్ ఫౌండేషన్ ప్రొఫెసర్ డా. ఎన్.ఎన్. మూర్తి గారి నాయకత్వంలోని జాగృతి కిరణ్ ఫౌండేషన్
ఈ ' పర్యావరణ కవితోద్యమం ' ప్రారంభించింది.
పర్యావరణ కవితోద్యమము
పర్యావరణ కవితోద్యమం తెలుగు నాట ప్రారంభమైన ఓ ఉద్యమం. ఇది 2008 లో ప్రారంభమైనది. తెలుగు సాహిత్యంలో ఇది ఓ గొప్ప మలుపు. తెలుగు సాహిత్యంలో పర్యావరణ స్పృహ తేవాలనే తపనతో ఈ ఉద్యమం ప్రారంభమైనది. అది 2008, తెలుగు కవి లోకం దళితవాదం, స్త్రీవాదం గురించి చర్ఛిస్తున్న రోజుల్లో ఈ ఉద్యమం కవులను తన వైపు ఆకర్షించింది. ఒక్కసారి అందరినీ ఆలోచింపచేసింది. ఇప్పటికి దీని ప్రభావం తెలుగు కవిత్వం మీద ఎంతోఉంది. అనేకమంది కవులు దీనికి ప్రభావితులు అయ్యారు.హరిత కవిత
హరిత కవిత అనేది పర్యావరణ కవితోద్యమం లో ఒక కార్యక్రమము. ఇది అంతర్జాతీయ తెలుగు కవితల పోటీ. జాగృతి కిరణ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని 'మల్లె తీగ' అనే పత్రికతో కలసి ప్రారంభించింది. .2008లో ప్రారంభమైన ఈ ఉద్యమానికి శ్రీకారం హరిత కవితతోనే జరిగింది. సృజనాత్మక ప్రక్రియలద్వారా, రచనలద్వారా పర్యావరణం మీద అవగాహన కల్పించాలనదే ఈ ఉద్యమం యొక్క ముఖ్యలక్ష్యం.
No comments:
Post a Comment