' పర్యావరణ కవితోద్యమం ' in ' Facebook '

' పర్యావరణ  కవితోద్యమం ' in ' Facebook '
' పర్యావరణ కవితోద్యమం ' in ' Facebook '

ప్రొఫెసర్ డా. ఎన్.ఎన్. మూర్తి

నారాయణం నరసింహ మూర్తి
NNMurthy Bust-2.jpg
నారాయణం నరసింహ మూర్తి
జన్మ నామం నారాయణం నరసింహ మూర్తి
జననం 1964, మే 02
నరసరావుపేట ,ఆంధ్రప్రదేశ్
నివాసం నాగపూర్
ఇతర పేర్లు ఎన్ ఎన్ మూర్తి
ప్రాముఖ్యత "విద్యావాచస్పతి" డాక్టర్ ఎన్ ఎన్ మూర్తి
వృత్తి నాణ్యత, పర్యావరణ నిపుణుడు, కవి పండితుడు
మతం హిందు
భార్య/భర్త శ్రీవాణి
సంతానం కేశవ శ్రీనివాస జాగృత్
తండ్రి శ్రీనివాసాచార్యులు
తల్లి పారుజాతలక్ష్మి
 నారాయణం నరసింహ మూర్తి
ఎన్ ఎన్ మూర్తి అని ప్రముఖంగా పిలువబడే ఆయన పూర్తి పేరు నారాయణం నరసింహ మూర్తి. అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ఓ ప్రముఖ పర్యవరణ వేత్త. ఆయన పర్యావరణ కవితోద్యమం అనే ఉద్యమాన్ని తెలుగు నాట 2008 లో ప్రారంభించారు. ఆయన జాగృతీ కిరణ్ ఫౌండేషన్ అనే సంస్థను నాగపూర్ లో 1993 లో స్థాపించాడు. ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సంస్థ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు సాహిత్య, సామాజిక వికాసానికి ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారు.

కుటుంబం

ఆయన 1964 లో గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పట్టణం లో నారాయణం శ్రీనివాసులు, పారిజాత లక్ష్మి దంపతులకు మొదటి పుత్రుడుగా జన్మించాడు.

జీవిత ప్రస్థానం

విద్యావిజయాలు

ఆయన అనేక డిగ్రీలు సంపాదించాడు. 29 డిగ్రీలు 21 విశ్వవిద్యాలయాల నుండి సాధించి 2008 సంవత్సరంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు.

విదేశీ పర్యటనలు  

అనేక దేశాలు పర్యటించాడు. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, కువైట్, కతార్, బహరేన్, దుబాయి, షార్జా, ఇరాన్, జర్మనీ, బెల్జయం, ఆస్ట్రియా, నెదర్లండ్స్, దక్షిణాఫ్రికా, ఒమన్ మొదలైన దేశాలు పర్యటించాడు. కువైట్, దుబాయి, బెల్జియం దేశాలు పలుమార్లు వెళ్ళాడు.

దేశవిదేశాలలో ఉపన్యాసాలు

ఆయన 2004లో జర్మనీలో పర్యటించాడు. జర్మనీ లో దాదాపు 4000 కి.మీ ప్రయాణించాడు.
సావరిన్ ఆర్డర్ ఆఫ్ నైట్స్ ఆఫ్ జస్టిస్ అనే సంస్ఠ నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు దేశభక్తి అనే అంశం పై ముఖ్య ఉపన్యాసం వెలువరించాడు. ఈ సదస్సు బ్లాక్ ఫారెస్ట్ లోని ఒక రాజభవనంలో జరిగింది.
ఆయన 2005 లో ఆస్ట్రియా లో పర్యటించాడు. అక్కడ సెల్జ్బర్గ్ రాష్ట్ర గవర్నరు ఆహ్వానం మీద, ప్లేజ్ అనే సంస్ఠ ఆస్ట్రీయా లోని సెల్జ్బర్గ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలసి నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన "అణుఇంధనం ప్రపంచ భవిష్యత్తు" అనే అంశం పై ముఖ్య ఉపన్యాసం వెలువరించారు. ఈ ఉపన్యాసం ఆయనకు ఎంతో పేరు తెచ్చింది.
ఆయన 2009 లో నెదర్లాండ్స్ లో పర్యటించాడు. నెదర్లాండ్స్ ప్రభుత్వం ఆహ్వానం మీద ఝీలాండ్ రాష్ట్రం లో వైస్(WISE) అనే సంస్థ నెదర్లాండ్స్ ప్రభుత్వంతో కలసి నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన భారతదేశ ఇంధన అవసరాలు, దేశ భవిష్యత్ అనే అంశం పై ముఖ్య ఉపన్యాసం వెలువరించాడు. [3]ఈ ఉపన్యాసం నెదర్లాండ్స్ టివి లో ప్రసారం అయింది.
ఇదే సదస్సులొ ఆయన పర్యావరణ కవితోద్యమం గురించి కూడ ఓ ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చాడు. ఈ ఉపన్యాసం అందరిని ఆకర్షించింది. ఈ ఉపన్యాసం తర్వాత పర్యావరణ కవితోద్యమం పై ఆయన ఇంటర్వ్యూ DW Radio వారు రికార్డు చేసి ప్రసారం చేసారు.

ప్రముఖులతో

ఆయన ఉమెన్ ఇన్ మ్యానెజ్మెంట్ అనే పుస్తకాన్ని మరు ఇద్దరితో కలసి వ్రాసారు. దానిని కువైట్ రాజవనిత షీఖా ఆమ్తల్ అల్ల్ సభా కు అంకితం ఇచ్చారు. ఈ పుస్తకావిష్కరణ సభ కువైట్‌లో 2007 సంవత్సరం జనవరిలో గొప్పగా జరిగంది. దీనికి అమెరికా రాయబారి, కువైట్ మంత్రులు దేశవిదేశాల నండి అనేక మంది ప్రముఖులు వచ్చారు. ఈ సభలో ఆయనను కువైట్ రాజవనిత షీఖా ఆమ్తల్ అల్ల్ సభా ఘనంగా సత్కరించారు. ఈ వార్త కువైట్ వార్తాపత్రికలలో ప్రముఖంగా వచ్చింది.

రచనలు / పుస్తకాలు

1. ' నేను ' కవితాసంపుటిని 1996 లో వెలువరించారు. ఇది ఆయన మనోభావాల మానసపుత్రిక. దీనికి 1998 లో కలకత్తా వారి మైఖేల్ మధుసూధన్ అవార్డ్ లభించింది.
2. Curriculum Vitae International అనే పెద్ద గ్రంథానికి సంపాదకత్వం వహించి, ముద్రించి 1997 సంవత్సరంలో వెలువరించారు.
3. World’s Who’s Who Men & Women of Distinction అనే పెద్ద గ్రంథానికి సంపాదకత్వం వహించి, ముద్రించి 2000 సంవత్సరంలో వెలువరించారు.
4. Indian Managers-Winning at Crossroads అనే మేనేజ్‌మెంట్ పుస్తకానికి సహరచయిత.
5. Women in Management అనే మేనేజ్‌మెంట్ పుస్తకానికి సహరచయిత.
6. Women Managers in 21 Century అనే మేనేజ్‌మెంట్ పుస్తకానికి సహరచయిత.
7. Environmental Management అనే పుస్తకాన్ని రచించారు.

జాతీయ పురస్కారాలు

1. ది ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్(ఇండియా) వారు 1991 సంవత్సరంలో నిర్వహించిన జాతీయస్థాయి పొటీలో ఆయన వ్రాసిన టెక్నికల్ పేపరుకు జాతీయస్థాయి బంగారు పతకం లభించింది. ఈ టెక్నికల్ పేపరును అనేక విశ్వవిద్యాలయాలు నాడు ప్రమాణంగా స్వీకరించాయి.
2. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎక్జిక్యూటివ్స్ అనే సంస్థ 1993 లో సమాజశ్రీ పురస్కరాన్నిచ్చి సత్కరించింది. ఈ పురస్కారం ఆయన మహారాష్ట్ర గవర్నరు నుండి అందుకున్నారు.

అంతర్జాతీయ పురస్కారాలు

  1. ఇంగ్లడ్ లోని సావరిన్ ఆర్డర్ ఆఫ్ నైట్స్ ఆఫ్ జస్టిస్ వారు ఆయన విద్యారంగంలో సాధించిన విజయాలకు మరియు సేవలకు నైట్ ఆఫ్ జస్టిస్ ను 2004 సంవత్సరంలో జర్మనీ లోని బ్లాక్ ఫారెస్ట్ లో ఒక రాజభవనం లో ప్రధానం చేశారు.
  2. అల్బర్ట్ స్ఛ్వెట్జర్ ఇంటనేషనల్ యునివర్సిటి, స్పెయిన్ ఆయన పర్యావరణానికి చేసిన విశిష్ట సేవలకు అల్బర్ట్ స్ఛ్వెట్జర్ మెడల్ ఫర్ సైన్స్ అండ్ పీస్ ను 2005 సంవత్సరంలో ఇచ్చి గౌరవించింది.

ప్రత్యేక గుర్తింపు

  1. ఆయన పర్యావరణానికి చేసిన సేవలను గుర్తించి 2003 సంవత్సరంలో యునెస్కో ఆయనను మెసెంజర్ ఫర్ కల్చర్ ఆఫ్ పీస్  అంటే "సంస్కృతి ద్వారా శాంతి సందేశకుడు" గా నియమించింది. ఇది చెప్పుకోదగ్గ గుర్తింపు. భారతదేశంలో అతి కొద్ది మందికి ఈ గుర్తింపు లభించింది.
  2. ఆయన సేవలను గుర్తించి అమెరికా లోని కెంటక్కి రాష్ట్ర గవర్నర్ ఆయనను 2007 సంవత్సరంలో గౌరవ కెంటక్కి కల్నల్  గా నియమించాడు. ఇది గొప్ప గౌరవం. భారతదేశంలోనే ఒకరిద్దరికి ఈ గౌరవం లభించింది.