' పర్యావరణ కవితోద్యమం ' in ' Facebook '

' పర్యావరణ  కవితోద్యమం ' in ' Facebook '
' పర్యావరణ కవితోద్యమం ' in ' Facebook '

Friday, November 25, 2011

పర్యావరణ స్ఫూర్తికి ‘వందనా’లు

పర్యావరణం అంటే అమెకు ప్రాణం. దాని కోసం ఎంతదూర మైనా ప్రయాణిస్తారు. మనం తినే ఆహారపదార్థాలను ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకంతో కలుషితం చేస్తున్నారని, దీని వల్ల స్వచ్ఛమైన ఆహారం తినలేక పోతున్నామన్నది ఆమె ఆందోళన. ఈ అంశంపై ఉద్యమం చేయడమే కాదు దాన్ని అక్షరాలా పాటించడానికి కూడా వెనుకాడరు. ఆమెనే పర్యావరణవేత్త ‘వందనా శివ’. పర్యావరణానికి ఆమె చేసిన సేవకు గాను ఆమెను సిడ్నీ శాంతి పురస్కారం వరించింది.

ప్రొఫైల్‌
పూర్తిపేరు : వందనా శివ vandd 
పుట్టిన తేది : నవంబర్‌ 5, 1952 జన్మ స్థలం : డెహ్రడూన్‌, ఉత్తరాఖండ్గ. విద్యాభ్యాసం : కెనడాలోని వెస్ట్రన్‌ ఒంటోరియో యూనివర్సిటీ నుంచి పి.హెచ్‌డి ప్రస్తుత నివాసం : ఢిల్లీ వృత్తి : ఫిలాసఫర్‌, పర్యావరణవేత్త, ఎకో ఫెమినిస్ట్‌, రచయిత. విశిష్టత : పర్యావరణ ప్రేమికురాలు, సుమారు 
300 పత్రికలకు శాస్త్ర సాంకేతిక వ్యాసాలు రాస్తున్నారు. కీర్తి కిరీటం : సిడ్నీ పీస్‌ అవార్డు(2010)

వందన శివ1978లో కెనడాలోని వెస్ట్రన్‌ ఒంటారి యో విశ్వవిద్యాలయం నుంచి భౌతికశాస్త్రంలో’ (క్వాంటమ్‌ థియెరీ) పి.హెచ్‌.డి.పూర్తి చేశారు. కేవలం పరిశోధనలకే పరిమితం అవ్వకుండా పర్యావరణం కోసం ప్రత్యక్షంగా కృషి చేశారు. అంతర్జాతీయ గ్లోబలైజేషన్‌ ఫారమ్‌లో సభ్యురాలు కూడా.అంతే కాకుండా ఆల్టర్‌ గ్లోబలైజేషన్‌ మూమెంట్‌లో కూడా సభ్యురాలు.పర్యావరణం కోసం ఆవిడ ఎంతగానో కృషి చేశారు. బయోడైవర్సిటీ, బయోటెక్నాలజీ, బయోఎథిక్స్‌, జెనెటిక్‌ ఇంజినీరింగ్‌లో ప్రావీణ్యం సంపాదించి ఆయా రంగాలలో సేవల ను అందించారు.‘గ్రాస్‌ రూట్‌’ అనే సంస్థకు సహకారం అందించారు. ఈ సంస్థ ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా, ఐర్‌లాండ్‌, స్విట్జర్‌లాండ్‌, ఆస్ట్జ్రియాలో జెనటిక్‌ ఇంజనీరింగ్‌ గురించి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అంతే కాకుండా భుటాన్‌ ్రపభుత్వం కోసం మూడు సంవత్సరాలు పనిచేశారు.

లవ్‌ ఆఫ్‌ వాటర్‌ ...
Save_The_World_Awards 
వందన సహజసిద్ధ ఆహారపదార్థాల వినియోగంపై అవగాహన కల్పించడం కోసం పలు డాక్యుమెంటరీ చిత్రాలను రూపొందించారు. వాటిలో ఒక అంతర్జాతీయ డాక్యుమెంటరీ చిత్రం కూడా ఉంది. సంజివ్‌ చటర్జీ, ఆలీ హబాసీ దర్శకత్వం వహించిన వన్‌వాటర్‌ అనే డాక్యు మెంటరీ చేశారు. ఈ డాక్యుమెంటరీ అవార్డును సైతం గెలుచుకుంది. నీటికాలుష్యం, స్వచ్ఛమైన నీరు మలినమవుతున్న విధానాన్ని ఈ చిత్రం చర్చించింది. ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని 15 దేశా లు, మియామి యూనివర్సిటీకి చెందిన స్కూల్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌, కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, ప్రోస్ట్‌స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌లు సంయుక్తంగా నిర్మించాయి.

అలాగే బ్లూగోల్డ్‌ (వరల్డ్‌ వాటర్‌ వార్స్‌) అనే ఫీచర్‌ డాక్యుమెంటరీలోనూ నటించారు. దీన్ని శామ్‌ బోజో నిర్మించారు. డైర్ట్‌ అనే ఫీచర్‌ డాక్యుమెంటరీలోనూ, ఎరీనా శాలినా డాక్యుమెంటరీ ప్లో: ఫర్‌ లవ్‌ ఆఫ్‌ వాటర్‌ లోనూ ఉన్నారు. రెండింటినీ 2008 సన్‌డాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఇవే కాకుండా విత్తన రంగం, జెనెటిక్‌ ఇంజనీరింగ్‌, ఇండస్ట్రియల్‌ అగ్రి క ల్చర్‌లో ప్రత్యామ్నాయాల పై ఫెడ్‌ ఆఫ్‌ అనే డాక్యుమెంటరీ, ఇటీవల మార్కెట్లో కి వచ్చిన మోన్‌ శాంటో విత్తనాలపై కూడా మరో డాక్యుమెంటరీని రూపొందిం చారు. త్వరలోనే ప్రముఖ బౌద్ధమత గురువు దలైలామాపై డాక్యుమెంటరీ చి త్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు.

సేవకు గుర్తింపుగా...
Vandana 
ప్రముఖ భారతీయ భౌతిక శాస్తవ్రేత్త, పర్యావరణవేత్త వందనాశివ ప్రతిష్టా త్మక సిడ్నీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. సామాజిక న్యాయ రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా ఆమెను ఈ ఏడాది ఈ అవార్డుకు ఎంపి చేశారు. తత్వవేత్త, పర్యావరణవేత్త, మహిళహక్కుల కార్య కర్త, రచయిత కూడా అయిన వందన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మహిళల సాధికరత కోసం కృషికి, పర్యావరణ సమతుల్యతకు ఆమె అందించిన శాస్ర్తీ య విశ్లేషణ లకు గుర్తింపుగా ఈ ఏడాది అవార్డు గెలుచుకున్నారు అని డిస్నీ యూనివర్సిటీ తెలిపింది.

ఎకోఫ్రెండ్లీ
భారతీయ వ్యవసాయ రంగాన్ని విష తుల్య ఆహరపదార్థాలను విముక్తి కలిగించాల్సిన అవసరం ఉందని వందన గట్టిగా వాదిస్తారు. కేవలం వారి వారి స్వార్థం కోసం బిటీ రకాలను ఉత్పత్తి చేస్తున్నారని వీటివల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువున్నాయన్నది వందన ఆరోపణ.వీటి స్థానంలో ఏకోప్రెంఢ్లీ పంటలను పెంచాలన్నది వందన సూచన. వందన వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులు , వాటి నివారణ విషయంలో చేస్తున్న కృషికి గాను గతంలో అనేక అవార్డులు అందుకున్నారు. ఆధునిక అభివృద్ధిలో మహిళల పాత్ర అనే అంశానికి గాను రైట్‌లైవ్‌లీహుడ్‌ అవార్డును అందు కున్నారు. చిన్నతనంలోనే వందన చిప్కో ఉద్యమంలోనూ పాల్గొన్నారు. మహిళా సమస్యలపై నిరంతరం పోరాడే వందనకు ప్రస్తుతం సిడ్నీ శాంతి పురస్కారానికి ఎంపిక కావడం హర్షణీయం.

పర్యావరణ సేవలో
Vandana-Shiva 
వందన పర్యావరణ పరిరక్షణకోసం ఆహర్నిశలు శ్రమిస్తారు. ఆహారధాన్యాల ఉత్పత్తుల్లో పర్టిలైజర్స్‌ వాడకాన్ని ఆమె పూర్తిగా వ్యతిరేకిస్తారు. క్రిమిసంహారక మందులు వాడడం మూలంగా పర్యావరణానికి పెనుముప్పు పొంచి ఉందని వరదన ఆందోళన వ్యక్తం చేస్తారు. సహజసిద్ధ ఆహార ఉత్పత్తులకోసం వందన కృషి చేస్తున్నారు. అందుకే ఆమెను టైమ్‌ మ్యాగజైన్‌ పర్యావరణ హీరోగా అభివర్ణించింది. అంతేకాదు వందన వివిధ రంగాల్లో చేస్తున్న కృషికిగాను ఆసియాఖండంలో ఉన్న ఐదుగురు శక్తివంతమైన మహిళల్లో వందన ఒకరని ఆసియా వీక్‌ కీర్తించింది. ఆహారధాన్యాలను కేవలం అధిక ఉత్పత్తి పేరుతో విష తుల్యం చేస్తున్నారని దీనివల్ల, మనుషులకు, జంతువులకు, పర్యావరణానికి కూడా అనేక సమస్యలు వస్తున్నాయన్నది వందన అభిప్రాయం.నవధాన్య పేరుతో వందన ప్రత్యేక ఉద్యమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛమైన విత్తనాలను కాపా డుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం.
అవార్డులు

  • సేవ్‌ ది ఎర్త్‌ అవార్డు(2009)
  • సిడ్నీ పీస్‌ అవార్డు(2010)
  • క్యాల్గరీ పీస్‌ ప్రైజ్‌(2011)
  • ఆర్డర్‌ ఆఫ్‌ ది ఆర్క్‌-1993 (నెదర్లాండ్‌ ప్రిన్స్‌ బెర్న్‌హార్డ్‌ నుంచి)
  • ఎర్త్‌ డే ఇంటర్నేషనల్‌ అవార్డు(1993)
  • గోల్డెన్‌ ప్లాంట్‌ అవార్డు(1997)