' పర్యావరణ కవితోద్యమం ' in ' Facebook '

' పర్యావరణ  కవితోద్యమం ' in ' Facebook '
' పర్యావరణ కవితోద్యమం ' in ' Facebook '

Friday, November 25, 2011

పర్యావరణ స్ఫూర్తికి ‘వందనా’లు

పర్యావరణం అంటే అమెకు ప్రాణం. దాని కోసం ఎంతదూర మైనా ప్రయాణిస్తారు. మనం తినే ఆహారపదార్థాలను ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకంతో కలుషితం చేస్తున్నారని, దీని వల్ల స్వచ్ఛమైన ఆహారం తినలేక పోతున్నామన్నది ఆమె ఆందోళన. ఈ అంశంపై ఉద్యమం చేయడమే కాదు దాన్ని అక్షరాలా పాటించడానికి కూడా వెనుకాడరు. ఆమెనే పర్యావరణవేత్త ‘వందనా శివ’. పర్యావరణానికి ఆమె చేసిన సేవకు గాను ఆమెను సిడ్నీ శాంతి పురస్కారం వరించింది.

ప్రొఫైల్‌
పూర్తిపేరు : వందనా శివ vandd 
పుట్టిన తేది : నవంబర్‌ 5, 1952 జన్మ స్థలం : డెహ్రడూన్‌, ఉత్తరాఖండ్గ. విద్యాభ్యాసం : కెనడాలోని వెస్ట్రన్‌ ఒంటోరియో యూనివర్సిటీ నుంచి పి.హెచ్‌డి ప్రస్తుత నివాసం : ఢిల్లీ వృత్తి : ఫిలాసఫర్‌, పర్యావరణవేత్త, ఎకో ఫెమినిస్ట్‌, రచయిత. విశిష్టత : పర్యావరణ ప్రేమికురాలు, సుమారు 
300 పత్రికలకు శాస్త్ర సాంకేతిక వ్యాసాలు రాస్తున్నారు. కీర్తి కిరీటం : సిడ్నీ పీస్‌ అవార్డు(2010)

వందన శివ1978లో కెనడాలోని వెస్ట్రన్‌ ఒంటారి యో విశ్వవిద్యాలయం నుంచి భౌతికశాస్త్రంలో’ (క్వాంటమ్‌ థియెరీ) పి.హెచ్‌.డి.పూర్తి చేశారు. కేవలం పరిశోధనలకే పరిమితం అవ్వకుండా పర్యావరణం కోసం ప్రత్యక్షంగా కృషి చేశారు. అంతర్జాతీయ గ్లోబలైజేషన్‌ ఫారమ్‌లో సభ్యురాలు కూడా.అంతే కాకుండా ఆల్టర్‌ గ్లోబలైజేషన్‌ మూమెంట్‌లో కూడా సభ్యురాలు.పర్యావరణం కోసం ఆవిడ ఎంతగానో కృషి చేశారు. బయోడైవర్సిటీ, బయోటెక్నాలజీ, బయోఎథిక్స్‌, జెనెటిక్‌ ఇంజినీరింగ్‌లో ప్రావీణ్యం సంపాదించి ఆయా రంగాలలో సేవల ను అందించారు.‘గ్రాస్‌ రూట్‌’ అనే సంస్థకు సహకారం అందించారు. ఈ సంస్థ ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా, ఐర్‌లాండ్‌, స్విట్జర్‌లాండ్‌, ఆస్ట్జ్రియాలో జెనటిక్‌ ఇంజనీరింగ్‌ గురించి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అంతే కాకుండా భుటాన్‌ ్రపభుత్వం కోసం మూడు సంవత్సరాలు పనిచేశారు.

లవ్‌ ఆఫ్‌ వాటర్‌ ...
Save_The_World_Awards 
వందన సహజసిద్ధ ఆహారపదార్థాల వినియోగంపై అవగాహన కల్పించడం కోసం పలు డాక్యుమెంటరీ చిత్రాలను రూపొందించారు. వాటిలో ఒక అంతర్జాతీయ డాక్యుమెంటరీ చిత్రం కూడా ఉంది. సంజివ్‌ చటర్జీ, ఆలీ హబాసీ దర్శకత్వం వహించిన వన్‌వాటర్‌ అనే డాక్యు మెంటరీ చేశారు. ఈ డాక్యుమెంటరీ అవార్డును సైతం గెలుచుకుంది. నీటికాలుష్యం, స్వచ్ఛమైన నీరు మలినమవుతున్న విధానాన్ని ఈ చిత్రం చర్చించింది. ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని 15 దేశా లు, మియామి యూనివర్సిటీకి చెందిన స్కూల్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌, కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, ప్రోస్ట్‌స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌లు సంయుక్తంగా నిర్మించాయి.

అలాగే బ్లూగోల్డ్‌ (వరల్డ్‌ వాటర్‌ వార్స్‌) అనే ఫీచర్‌ డాక్యుమెంటరీలోనూ నటించారు. దీన్ని శామ్‌ బోజో నిర్మించారు. డైర్ట్‌ అనే ఫీచర్‌ డాక్యుమెంటరీలోనూ, ఎరీనా శాలినా డాక్యుమెంటరీ ప్లో: ఫర్‌ లవ్‌ ఆఫ్‌ వాటర్‌ లోనూ ఉన్నారు. రెండింటినీ 2008 సన్‌డాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఇవే కాకుండా విత్తన రంగం, జెనెటిక్‌ ఇంజనీరింగ్‌, ఇండస్ట్రియల్‌ అగ్రి క ల్చర్‌లో ప్రత్యామ్నాయాల పై ఫెడ్‌ ఆఫ్‌ అనే డాక్యుమెంటరీ, ఇటీవల మార్కెట్లో కి వచ్చిన మోన్‌ శాంటో విత్తనాలపై కూడా మరో డాక్యుమెంటరీని రూపొందిం చారు. త్వరలోనే ప్రముఖ బౌద్ధమత గురువు దలైలామాపై డాక్యుమెంటరీ చి త్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు.

సేవకు గుర్తింపుగా...
Vandana 
ప్రముఖ భారతీయ భౌతిక శాస్తవ్రేత్త, పర్యావరణవేత్త వందనాశివ ప్రతిష్టా త్మక సిడ్నీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. సామాజిక న్యాయ రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా ఆమెను ఈ ఏడాది ఈ అవార్డుకు ఎంపి చేశారు. తత్వవేత్త, పర్యావరణవేత్త, మహిళహక్కుల కార్య కర్త, రచయిత కూడా అయిన వందన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మహిళల సాధికరత కోసం కృషికి, పర్యావరణ సమతుల్యతకు ఆమె అందించిన శాస్ర్తీ య విశ్లేషణ లకు గుర్తింపుగా ఈ ఏడాది అవార్డు గెలుచుకున్నారు అని డిస్నీ యూనివర్సిటీ తెలిపింది.

ఎకోఫ్రెండ్లీ
భారతీయ వ్యవసాయ రంగాన్ని విష తుల్య ఆహరపదార్థాలను విముక్తి కలిగించాల్సిన అవసరం ఉందని వందన గట్టిగా వాదిస్తారు. కేవలం వారి వారి స్వార్థం కోసం బిటీ రకాలను ఉత్పత్తి చేస్తున్నారని వీటివల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువున్నాయన్నది వందన ఆరోపణ.వీటి స్థానంలో ఏకోప్రెంఢ్లీ పంటలను పెంచాలన్నది వందన సూచన. వందన వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులు , వాటి నివారణ విషయంలో చేస్తున్న కృషికి గాను గతంలో అనేక అవార్డులు అందుకున్నారు. ఆధునిక అభివృద్ధిలో మహిళల పాత్ర అనే అంశానికి గాను రైట్‌లైవ్‌లీహుడ్‌ అవార్డును అందు కున్నారు. చిన్నతనంలోనే వందన చిప్కో ఉద్యమంలోనూ పాల్గొన్నారు. మహిళా సమస్యలపై నిరంతరం పోరాడే వందనకు ప్రస్తుతం సిడ్నీ శాంతి పురస్కారానికి ఎంపిక కావడం హర్షణీయం.

పర్యావరణ సేవలో
Vandana-Shiva 
వందన పర్యావరణ పరిరక్షణకోసం ఆహర్నిశలు శ్రమిస్తారు. ఆహారధాన్యాల ఉత్పత్తుల్లో పర్టిలైజర్స్‌ వాడకాన్ని ఆమె పూర్తిగా వ్యతిరేకిస్తారు. క్రిమిసంహారక మందులు వాడడం మూలంగా పర్యావరణానికి పెనుముప్పు పొంచి ఉందని వరదన ఆందోళన వ్యక్తం చేస్తారు. సహజసిద్ధ ఆహార ఉత్పత్తులకోసం వందన కృషి చేస్తున్నారు. అందుకే ఆమెను టైమ్‌ మ్యాగజైన్‌ పర్యావరణ హీరోగా అభివర్ణించింది. అంతేకాదు వందన వివిధ రంగాల్లో చేస్తున్న కృషికిగాను ఆసియాఖండంలో ఉన్న ఐదుగురు శక్తివంతమైన మహిళల్లో వందన ఒకరని ఆసియా వీక్‌ కీర్తించింది. ఆహారధాన్యాలను కేవలం అధిక ఉత్పత్తి పేరుతో విష తుల్యం చేస్తున్నారని దీనివల్ల, మనుషులకు, జంతువులకు, పర్యావరణానికి కూడా అనేక సమస్యలు వస్తున్నాయన్నది వందన అభిప్రాయం.నవధాన్య పేరుతో వందన ప్రత్యేక ఉద్యమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛమైన విత్తనాలను కాపా డుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం.
అవార్డులు

  • సేవ్‌ ది ఎర్త్‌ అవార్డు(2009)
  • సిడ్నీ పీస్‌ అవార్డు(2010)
  • క్యాల్గరీ పీస్‌ ప్రైజ్‌(2011)
  • ఆర్డర్‌ ఆఫ్‌ ది ఆర్క్‌-1993 (నెదర్లాండ్‌ ప్రిన్స్‌ బెర్న్‌హార్డ్‌ నుంచి)
  • ఎర్త్‌ డే ఇంటర్నేషనల్‌ అవార్డు(1993)
  • గోల్డెన్‌ ప్లాంట్‌ అవార్డు(1997)

Tuesday, June 28, 2011

పచ్చని బహుమతులు

ఏ వేడుకకెళ్లినా...వట్టి చేతులతో వెళ్లడం ఇష్టం ఉండదు. మన అభిమానాన్ని ఏదో ఒక వస్తువు రూపంలో వారికి ఇవ్వాలనుకుంటాం. బహుమతుల స్థానాన్ని నేడు బొకేలు ఆక్రమించేశాయి. తాజాపూల గుచ్ఛం చేతికిచ్చి శుభాకాంక్షలు తెలపడం అందరికీ అలవాటైపోయింది. అయితే చేతికందిన మరుక్షణమే పక్కన పడేసే పూలకు బదులు ఎప్పుడూ పచ్చగా ఉండే మొక్కల్ని బహుమతిగా ఇచ్చే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు పద్మా వికాస్. ఏదైనా శుభకార్యానికి వెళుతున్నప్పుడు బొకేకి బదులు పూలమొక్కల్ని వెంటపట్టుకెళ్లి ఇవ్వమని సలహా ఇస్తున్నారు..

"రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం నుంచి తప్పించుకోడానికి మనకు ఉన్న ఒకే ఒక్క దారి చెట్ల పెంపకం. అందరికీ తెలిసిన విషయమే అయినా ఆచరించేవారెందరు? ముఖ్యంగా పట్టణాల్లో గజం స్థలం కనిపిస్తే చాలు అందులో ఏం కట్టాలని ఆలోచిస్తారే గాని ఏదైనా మొక్క పెట్టాలని ఎవరూ అనుకోరు. దాంతో పట్టణం అంటే పొల్యూషన్ అనే ముద్ర పడిపోయింది. ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలని అందరూ కాకపోయినా కొందరు ప్రయత్నిస్తున్నారు. వారికి నా 'గ్రీన్ గిఫ్ట్' ఆలోచన నచ్చింది. ఫలితంగా నాలుగేళ్ల నుంచి ఈ పచ్చని బహుమతులు తయారుచేయడంలో మునిగిపోయాను.

సరదాగా మొదలుపెట్టాను...
నాకు పాతికేళ్ల వయసు ఉన్నప్పుడు ఆలోచన మొక్కలపైకి వెళ్లింది. ఇంట్లోనే గార్డెన్ పెట్టాను. చుట్టుపక్కల నర్సరీలలో ఉన్న మొక్కలన్ని సేకరించి గార్డెన్‌ని అందంగా డిజైన్ చేసేదాన్ని. బంధువులు, స్నేహితులు నా గార్డెన్ చూసి చాలా ముచ్చటపడేవారు. నేను చేసే చిన్న చిన్న ప్రయోగాలు చూసి ఆశ్చర్యపోయేవారు. ఎలా చేయాలంటూ సలహాలు అడుగుతుండేవారు. అలా నాలుగైదు ఏళ్లు గడిచాక గార్డెన్ డిజైనర్ అవ్వాలన్న ఆలోచన వచ్చింది.

మొక్కలకి సంబంధించిన పుస్తకాలు చదవడం, నర్సరీలకు వెళ్లి మొక్కల పెంపకం గురించి కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త ప్రయోగాలు చేయడం...అన్నీ చాలా సీరియస్‌గా చేశాను. తర్వాత గార్డెన్ డిజైనర్‌గా నన్ను నేనే నలుగురికీ పరిచయం చేసుకున్నాను. ముందు తెలిసిన వారింట్లో డిజైన్ చేశాను. నా వర్క్ చూసిన వారు ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇళ్లకే కాకుండా ఆఫీసులకు కూడా గార్డెన్స్ డిజైన్ చేశాను.

గార్డెన్ డిజైనర్‌గా...
గార్డెన్ డిజైనింగ్ గురించి చాలామందికి అవగాహన లేదు. వారికి నచ్చిన మొక్కల్ని తెచ్చుకుని పెట్టేసుకుంటారు. ఉన్న స్థలంలోనే ఎక్కువ మొక్కలు పెంచుకునేలా ప్లాన్ చేసుకోవడం రాకపోవడంతో చాలా స్థలం వృధాగా పోతుంది. గార్డెన్‌లో మొక్కలు ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ముందుగా అక్కడుండే మట్టిని పరిశీలించాలి. ఆ మట్టిలో ఎలాంటి మొక్కలు పెడితే బాగుంటుందో తెలుసుకుని మొక్కలు ఎంపిక చేసుకోవాలి.

ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతం అనగానే..కొంత భాగం ఎండలో ఉంటుంది. మరికొంత భాగం నీడలో ఉంటుంది. ఎక్కడ ఏ మొక్కలు పెట్టాలనే విషయం కూడా తెలిసి ఉండాలి. లేదంటే వేలు ఖర్చుపెట్టి తెచ్చిన మొక్కలు మూణ్ణాళ్లకే మాడిపోతాయి. ఈ విషయాలేమీ తెలుసుకోకుండా ఇంట్లో మొక్కలు పెంచుకోడానికి సిద్దపడినవారికి నిరాశే ఎదురవుతుంది. దాంతో 'ఏం మొక్కలో..! ఏంటో అందరిళ్లలో చక్కగా పెరుగుతాయి. మా ఇంట్లోనే మాడిపోతున్నాయి' అంటూ చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటి సంఘటనల్ని దృష్టిలో పెట్టుకునే నేను గార్డెన్ డిజైనర్ రంగాన్ని ఎంచుకున్నాను. నేను మూడు రకాల డిజైన్లు చేస్తాను. ట్రెడిషనల్ గార్డెన్, డ్రై గార్డెన్, ట్రాపికల్ గార్డెన్. ఎవరికి ఏది కావల్సిస్తే అది చేసి పెడతాను.

బహుమతుల ఆలోచన...
గ్రీన్ గిఫ్ట్ ఇచ్చే సంప్రదాయం విదేశాల్లో చాలా చోట్లా ఉంది. ఆరేళ్లక్రితం ఒకసారి విదేశాలకు వెళ్లినపుడు ఒక నర్సరీలో అమ్మకానికి పెట్టిన గ్రీన్ గిఫ్ట్‌లను చూశాను. అందమైన గాజు పాత్రలో రంగురంగుల రాళ్లు వేసి పచ్చని మొక్కలు పెట్టి ఉన్నాయి. మొక్క పేరు, ఎలా పెంచాలి, ధర తదితర వివరాలన్నీ కూడా రాసి ఉన్నాయి. ఇండియాకి తిరిగొచ్చాక గిఫ్ట్‌లకు కావలసిన మెటీరియల్‌ని సంపాదించి ఓ నాలుగు రకాల గిఫ్ట్‌లు తయారుచేశాను.

ఆ సమయంలో ఫ్రెండ్ ఇంట్లో వేడుకయితే వెళ్లాను. వేల రూపాయలు విలువచేసే బొకేలతో అందరూ వస్తే నేనేమో మొక్క పట్టుకుని వెళ్లాను. అందరూ నా చేతిలో ఉన్న గాజు కుండీవైపే చూశారు. నేను తీసుకెళ్లిన మొక్క ఖరీదు కూడా తక్కువేమీ కాదు. నాలుగువేల రూపాయల ఖరీదు. ఎందుకంటే నీడలో పెంచే మొక్క అది. ఖరీదైన గాజు కుండీ. అందులో నాలుగు రకాల రంగు రాళ్లు వేసాను. వాటి ఖరీదే పదిహేను వందలకు పైగా ఉంటుంది. మొత్తానికి నేను తీసుకెళ్లిన బహుమతే టాప్‌గా నిలిచింది. ఆ నోటా..ఈ నోటా తెలుసుకున్నవారంతా మా ఇంటికి వచ్చి రకరకాల గిఫ్ట్‌లు ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఏదో సరదాగా చేసిన ప్రయోగం సక్సెస్ అవ్వడంతో 'గ్రీన్ గిఫ్ట్' వ్యాపారమై కూర్చుంది.

పాండిచ్చెరీలో శిక్షణ...
గ్రీన్ గిఫ్ట్స్ గురించి ఇంటర్‌నెట్‌లో బాగా వెతికేదాన్ని ఒకసారి గోడకు చెక్కతో నిలబెట్టే మొక్కలను చూశాను. వాటి గురించి వివరాలు తెలుసుకుంటే వాల్‌ట్రీ ట్రైనింగ్ ఇన్స్‌టిట్యూట్ పాండిచ్చేరీలో ఉందని తెలిసింది. అక్కడికి వెళ్లి కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నాను. నేను తయారుచేసే గిఫ్ట్‌లలో వాల్ ట్రీ ప్రత్యేకమైంది. చెక్కలకు అతుక్కుని ఉంటాయి మొక్కలు. వాటిని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇందులోనే ట్రేస్ఐటమ్స్ అని మరో రకం కూడా ఉన్నాయి. వీటిని కిచెన్‌లో, పిల్లల గదుల్లో పెట్టుకోవచ్చు. బెడ్‌రూమ్‌లు, ఆఫీసు గదులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వాల్‌ట్రీస్‌కి ప్రస్తుతం చాలా గిరాకీ ఉంది. ఇవి మాత్రం ఖరీదెక్కువే. ఐదు వేల రూపాయల నుంచి ముప్పైవేల వరకూ ఉంటాయి.

ఎన్ని వెరైటీలున్నాయి...
మామూలు 'గ్రీన్ గిఫ్ట్'లు నూటయాభైరూపాయల నుంచి మొదలవుతాయి. మట్టిబొమ్మలు, గ్లాస్ కూజాలు, వెదురు బుట్టలు...రకరకాల వాటిల్లో పెట్టి అలంకరిస్తాను. మొక్కలకు అదనపు ఆకర్షణగా సీసపు రాళ్లు, రంగు రాళ్లని కూడా వేసాను. పుట్టినరోజులకు, పెళ్లికి...వేడుకని బట్టి మొక్కని పెట్టే కుండీని ఎంపికచేస్తాను. అలాగే కస్టమర్ ఆలోచనకు తగ్గట్టు తయారుచేసి ఇస్తాను. నాలుగు రోజుల ముందే ఆర్డరు ఇస్తే అడిగిన సమయానికి గిఫ్ట్ రెడీగా ఉంటుంది. నాలుగైదు ఏళ్ల నుంచి కృషి చేస్తుంటే ఇప్పుడు నా గిఫ్ట్‌లకు బాగా గిరాకీ వచ్చింది. నా సర్కిల్లో ఎవరు ఏ వేడుకకు వెళ్లినా గ్రీన్ గిఫ్ట్‌లను తీసుకెళ్లడానికే ఇష్టపడుతున్నారు.

కొత్త ఆలోచనలు...
నా దగ్గర కొత్తగా వచ్చిన వెరైటీ ఇంకోటుంది. వేలాడే మొక్కలు. హాంగింగ్ ప్లాంట్స్. మామూలుగా అయితే మొక్కల కుండీలను వేలాదీస్తాం. కాని నేను మొక్కనే వేలాడదీశాను. దానికి కుండీ ఉండదు. మొక్క వేర్ల దగ్గర పది అంగుళాల వెడల్పున మట్టిపెట్టి అది పడిపోకుండా సన్నని ఇనుప ఊచని చుడతాను. మట్టి కనపడకుండా చుట్టూ నీరుపీల్చే గుణమున్న గడ్డిని అంటిస్తాను. ఊచకి ఒక వెడల్పాటి తాడు కట్టి దీన్ని ఎక్కడైనా వేలాడగట్టొచ్చు. చూడ్డానికి అచ్చం పిచ్చుక గూడుపై మొక్క పెట్టినట్టు ఉంటుంది. నేనైతే వీటిని పెద్దగా ఉండే చెట్ల కొమ్మలకు వేలాడదీశాను. చూడ్డానికి వెరైటీగానూ ఉంటుంది. స్థలం కూడా ఆదా అవుతుంది. వీటిని ఆఫీసుల్లో పెట్టుకోడానికి ఎక్కువగా తీసుకెళుతున్నారు.

డైనింగ్ టేబుల్ గార్డెన్...
ప్రస్తుతం నేను చేస్తున్న ప్రయోగాల్లో డైనింగ్ టేబుల్ గార్డెన్ ఒకటి. మనం భోజనం చేసే టేబుల్‌పై నాలుగు పచ్చని మొక్కలుంటే ఎంత బాగుంటుంది. ఊహించుకోడానికి బాగానే ఉంటుంది కాని టేబుల్‌పై మొక్కలు పెంచడం అంత తేలిక కాదు. దీనికి మొక్కలతో ఉండే డైనింగ్ టేబుల్‌ని తయారుచేస్తాను. నలభైవేల వరకూ ఖర్చవుతుంది. మొక్కలకు పోను భోజనం ప్లేట్లు పెట్టుకోడానికి మాత్రమే స్థలం ఉంటుంది. మిగతా స్థలంలో వై ఆకారంలో, ఎక్స్ ఆకారంలో కాలువల్లా ఉండి అందులో పూల మొక్కలుంటాయి. టేబుల్‌పై ఉండే గ్లాస్ కింద భాగంలో అంతా మట్టే ఉంటుంది.

ఇరవైఏళ్ల నుంచి మొక్కలమధ్యన కూర్చుని మొక్కలగురించి ఆలోచిస్తున్నాను. ఆ సమయంలో వచ్చిన కొత్త కొత్త ఐడియాలే ఇవన్నీ. వాతావరణాన్ని పదికాలాలపాటు పచ్చగా ఉంచే కృషిలో నేనూ ఉన్నాననుకుంటే అదో తృప్తి.


భువనేశ్వరి